For Money

Business News

అమ్మకాలు సరే… లాభాలు తగ్గాయి

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 204 కోట్లుగా ప్రకటించింది. మార్కెట్‌ వర్గాలు మాత్రం కంపెనీ రూ. 231 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని ఆశించాయి. కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 14.4 శాతం పెరిగి రూ. 4080 కోట్లకు చేరింది. హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ వ్యాపారం నుంచి వచ్చిన టర్నోవర్‌ 5 శాతం పెరిగి రూ. 2277 కోట్లకు చేరింది. డిజిటల్‌ హెల్త్‌, ఫార్మసీ వ్యాపార విభాగం నుంచి వచ్చిన టర్నోవర్‌ 43 శాతం పెరిగి రూ. 1668 కోట్లకు చేరింది.