For Money

Business News

టోకు ధరలు తగ్గాయోచ్…

దేశంలో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్టానికి క్షీణించింది. ఆహారం, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో అక్టోబర్‌నెలలో 19 నెలల కనిష్ట స్థాయి 8.39 శాతానికి టోకు ధరల సూచీ తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సూచీ గత అయిదు నెలలుగా వరుసగా తగ్గుతూ వస్తోంది. అయితే సింగిల్ డిజిట్‌కు తగ్గడం మాత్రం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.
వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతవారం అంచనా వేశారు. వరుసగా వడ్డీ రేట్లను పెంచడతో టోకు ధరలు సూచీ తగ్గినట్లు భావిస్తున్నారు. అక్టోబరు నెల ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం … ఖనిజాలు, నూనెలు, బేస్ మెటల్స్, ఫ్యాబ్రికేెటెడ్ మెటల్ ప్రొడక్ట్స్ ధరలు తగ్గినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 2021 నుండి సెప్టెంబరు 2022 వరకు 18 నెలల పాటు WPI ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంది. అక్టోబర్ 2021లో ద్రవ్యోల్బణం 13.83 శాతంగా ఉంది. సెప్టెంబరు 2022లో అది 10.79 శాతానికి తగ్గింది.