For Money

Business News

మేలో టోకు ధరల సూచీ 15.88%

మే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 15.88 శాతానికి చేరింది. ఇది పదేళ్ళ గరిష్ఠం. 2012లో ఈ సిరీస్‌ ప్రారంభించిన తరవత నమోదైన టోకుధరల సూచీ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. రాయిటర్స్‌ వార్త సంస్థ జరిపిన సర్వేలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు టోకు ధరల సూచీ 15.10 శాతం ఉంటుందని అంచనా వేశారు. కాని పలు ఆహార, ఆహారేత వస్తువుల ధరలు గణనీయంగా పెరడగడతో టోకు ధరల సూచీ భారీగా పెరిగింది. గత ఏడాది మే నెలలో ఈ సూచీ 13.11 శాతం. మినరల్‌ ఆయిల్స్‌, క్రూడ్‌ పెట్ఓలియం, గ్యాస్‌, ఆహార వస్తువులు, ఆహారేతర వస్తువులు, బేసిక్‌ మెటల్స్‌, కెమికల్స్‌ ధరలు బాగా పెరిగినందున టోకు ధరల సూచీలో భారీ వృద్ధి నమోదైంది.