For Money

Business News

15850ని తాకిన నిఫ్టి

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి ప్రస్తుతం 15787 పాయింట్ల వద్ద 13 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అంతకుమునుపునిఫ్టి 15858 పాయింట్లను తాకింది. ఉదయం కనిష్ఠ స్థాయి 15659తో పోలిస్తే నిఫ్టి 200 పాయింట్లు లాభపడింది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌క్యాప్‌ ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. సూచీలు అరశాతంపైగా లాభాలు పొందాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ లెక్కన నిఫ్టి గ్రీన్‌లో ముగుస్తుందని భావిస్తున్నారు అనలిస్టులు. మరి అదెంత వరుక నిజమౌతుందో చూడాలి. నిఫ్టి నామమాత్రపు లాభాలకే పరిమితం కావడంతో… షార్ట్‌ కవరింగ్‌పై అనుమానాలు ఉన్నాయి. దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ 1.68 లాభంతో ట్రేడవుతోంది. ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది.