For Money

Business News

అయిదు నెలల కనిష్ఠానికి టోకు ధరల సూచి

టోకు ధరల సూచీ ఐదు నెల‌ల క‌నిష్ఠ స్థాయికి క్షీణించింది. ఆహార, త‌యారీ ఉత్పత్తుల ధ‌ర‌లు తగ్గడంతో జూలైలో టోకు ద్రవ్యోల్బణం 13.93 శాతంగా న‌మోదైంది. మే నెల‌లో టోకు ద్రవ్యోల్బణం 15.88 శాతంగా ఉంటే, జూన్‌లో 15.18 శాతంగా న‌మోదైంది. అంటే వరుసగా రెండో నెల కూడా తగ్గిందన్నమాట. ఆందోళనకర విషయం ఏమిటంటే 2021 ఏప్రిల్ నుంచి ఈ ద్రవ్యోల్బణం వ‌రుస‌గా 16వ నెల కూడా రెండంకెల స్థాయిలో కొన‌సాగుతుండ‌టం. జూన్‌లో ఆహార ఉత్పత్తుల ధ‌ర‌లు 14.33 శాతం ఉంటే జూలైలో 10.77 శాతానికి ప‌డిపోయాయి. అలాగే జూన్‌లో 56.75% పెరిగిన కూర‌గాయ‌ల ధ‌ర‌లు జూలైలో 18.25 శాతానికి ప‌త‌నం అయ్యాయి.