For Money

Business News

6న ఐఫోన్ 14 సిరీస్?

సెప్టెంబ‌ర్ తొలి వారం లేదా రెండో వారంలో ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్‌ ప్రారంభించనుంది. సెప్టెంబ‌ర్ 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసినా… పది రోజుల తరవాత అంటే సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుంచి అమ్మకాలు ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్‌ 14 ఈవెంట్‌ సెప్టెంబర్‌ 6న ఉంటుందని టెక్‌ నిపుణులు అంటున్నారు. ఐఫోన్‌ 14 విడుదలకు సంబంధించి ఒక ప్రి రికార్డెడ్‌ వీడియోను షూట్‌ చేసి… ఆ రోజు విడుదల చేస్తారని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్‌ గుర్మన్‌ చెప్పినట్లు బీజీఆర్‌ ఇండియా రాసింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మోడ‌ల్స్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ బ‌యోనిక్ ఏ15 చిప్‌సెట్‌తో వస్తున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 14 ప్రొ మోడ‌ల్స్ అత్యాధునిక ఏ16 చిప్‌సెట్‌ను క‌లిగిఉంటాయి. ఐఫోన్ 14 సిరీస్ లేటెస్ట్ ఐఓఎస్ 16 ఆప‌రేటింగ్ సిస్టమ్‌తో రానున్నాయి. ఇక ఐఫోన్ 14 సిరీస్ ధ‌రకు సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. 13 సిరీస్‌ కలర్స్‌తోపాటు కొత్త కలర్స్‌లో 14 సిరీస్‌లో ఐఫోన్‌ లభిస్తుందని వార్తలు వస్తున్నాయి.