For Money

Business News

రెండో స్థానం పాయే…

ప్రపంచంలోనే అత్యంత ధనువంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ.. ఆ స్థానాన్ని కోల్పోయారు. గతంలో రెండో స్థానంలో ఉన్న అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ మళ్ళీ రెండో స్థానానికి చేరారు. గత కొన్ని రోజులుగా నాస్‌డాక్‌ భారీగా క్షీణిస్తోంది. దీంతో అనేక టెక్‌, ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అయితే నిన్న కోలుకున్నాయి. దీంతో జెఫ్‌ బెజోస్‌ సంపద 136 కోట్ల డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియన్‌ ఇండెక్స్‌ ప్రకారం బెజోస్‌ సంపద 13800 కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో భారత స్టాక్‌ మార్కెట్‌లో వచ్చిన భారీ పతనం కారణంగా అదానీ సంపద 700 కోట్ల డాలర్లు క్షీణించింది. ఫలితంగా గౌతమ్‌ అదానీ సంపద 13500 కోట్ల డాలర్లకు పడిపోయింది. తాజా స్టాక్‌ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ ప్రకారం బెజోస్‌ రెండో మళ్ళీ స్థానానికి చేరడగా, అదానీ మూడో స్థానానికి చేరారు.