For Money

Business News

పోరాటమా… పలాయనమా?

ప్రముఖ జర్నలిస్ట్‌ ప్రణయ్‌ రాయ్‌ ఎదుట పెద్ద పరీక్ష నిలిచింది. 2009లో తీసుకున్న రూ.400 కోట్లు రుణం బదులుగా ఆయన ఇవాళ ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాను కోల్పోవాల్సి వచ్చింది. రుణం తీసుకున్నది ముకేష్‌ అంబానీ దగ్గర నుంచి ఇపుడు తీసుకుంటున్నది గౌతమ్‌ అదానీ. విశ్వప్రభ కమర్షియల్‌కు ముకేష్‌ అంబానీ రూ.400 కోట్లు రుణం ఇచ్చి… దాన్ని ఎన్‌డీటీవీలో పెట్టారు. మధ్యలో ఓ టెలికాం కంపెనీని కొనుగోలు చేసి నహతా కంపెనీకి ఎన్‌డీటీవీలో వాటాను బదిలీ చేశారు. ఇపుడు అంది అదానీ చేతికి వెళ్ళింది. ఎన్డీటీవీలో ప్రణయ్‌ రాయ్‌కు, ఆయన భార్యకు జూన్‌ 30వ దీని నాటికి 61.44 శాతం వాటా ఉంది. ప్రజలకు 38.55 శాతం వాటా ఉంది. తమకు ఉన్న 61.44 శాతం వాటాలో 29.18 శాతం వాటా ఇపుడు అదానీకి వెళ్ళింది. ఇపుడు సుమారు 32 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్ ఆఫర్‌ ప్రకటించింది. రూ.294 వద్ద షేర్లను కొంటానని పేర్కొంది. అయితే ఇవాళ ఎన్‌డీటీవీ షేర్‌ రూ.376.55 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి. పైగా ఈరోజు కూడా సీలింగ్‌ వద్ద ముగిసింది. అంటే ఈ ధర వద్ద కూడా ఎవరూ అమ్మడం లేదు. అదానీ ఆఫర్‌ రూ. 294 మాత్రమే.. మరి ఇన్వెస్టర్లు అమ్ముకుంటారా? పైగా స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ కంపెనీలకు భారీ డిమాండ్‌ ఉంది. కాబట్టి రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన లేకుంటే అదానీ కేవలం 29.18 శాతం వాటాతో కొనసాగాలి.ఈ మధ్య కాలంలో అదానీ ఇతర కంపెనీలు, వ్యక్తుల ద్వారా షేర్లను కొనిపించారు. వారు ఓపెన్‌ ఆఫర్‌లో అమ్ముతారా అన్నది చూడాలి. ఒకవేళ అలాంటి లేకుంటే పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ తరవాత ప్రణయ్‌కు మెజారిటీ వాటా ఉంటుంది. అలాంటి సమయంలో అదానీ ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటికే ప్రణయ్‌ కుటుంబంపై కేసులు ఉన్నాయి కాబట్టి… ఈ గొడవ ఎందుకని ప్రణయ్‌ తనకున్న వాటాను అమ్ముకుంటారా అన్నది చూడాలి. పాతిక సీట్లు తగ్గితే అధికారం పోయే స్థితిలో ఉన్న ఎన్డీఏకు భయపడతారా? పారిపోతారా అన్నది చూడాలి. ఎందుకంటే నహతాలు రిలయన్స్‌ను కూడా కాదని అదానీకి అమ్మారంటే.. వెనుక బలమైన శక్తులు ఉన్నట్లు ఇట్టే అర్థమైపోతోంది. వచ్చే ఏడాది ఎన్నికల సీజన్‌ ప్రారంభం కానుంది. పైగా డిజిటల్‌ రంగంలో ఇతర న్యూస్‌ ఛానల్స్‌ కన్నా ఎన్‌డీటీవీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మరి ప్రణయ్‌ ఏం చేస్తారో చూడాలి.