For Money

Business News

నిలకడగా వాల్‌స్ట్రీట్‌

యూరప్‌ మార్కెట్లు రెడ్‌లో ముగిసినా.. నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. అదే ట్రెండ్‌ అమెరికాలో కన్పిస్తోంది. పీఎంఐ డేటా నిరాశజనకంగా ఉండటంతో… వచ్చే నెల వడ్డీ రేట్ల పెంపు భారీగా ఉండకపోవచ్చన్న ఆశతో వాల్‌స్ట్రీట్‌లో పతనం ఆగింది. మూడు సూచీలు స్వల్ప లాభనష్టాల్లో ఉన్నాయి. డాలర్‌ కూడా స్వల్పంగా తగ్గింది. అయితే ఇరాన్‌ నుంచి మళ్ళీ ముడి చమురు సరఫరా మొదలైతే… ఒపెక్‌ దేశాలు ఆ మేరకు ఉత్పత్తిని తగ్గిస్తాయన్న వార్తతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 3.5 శాతం పైగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 100 డాలర్లకు చేరింది. డాలర్‌ ఇండెక్స్‌ 108 డాలర్లపైన ఉండటం, క్రూడ్‌ 100 డాలర్లకు చేరడమంటే భారత్‌కు ప్రతికూల అంశమే. మరోవైపు బులియన్‌ కూడా 0.7 శాతం వరకు లాభపడింది.