For Money

Business News

NIFTY TODAY: 18,320 పైన నిలబడేనా?

రాత్రి అమెరికా మార్కెట్లలో ఇన్ఫోసిస్‌ 5 శాతం లాభంతో ప్రారంభమై 2.7 శాతం లాభంతో ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసిన తరవాత జరిగిన ట్రేడింగ్‌లో మరో 1.75 శాతం పెరిగింది. అంటే ఇవాళ మన మార్కెట్లలో ఇన్ఫోసిస్‌ 5 శాతం లాభంతో ప్రారంభం కానుంది. ఇక టీసీఎస్‌ కంపెనీ ఫలితాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. టర్నోవర్‌ పెరిగినా, మార్జిన్‌ నిరుత్సాహపర్చిందని విశ్లేషిస్తున్నారు.కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు పాజిటివ్‌, మరికొన్ని నెగిటివ్‌ ఔట్‌లుక్‌ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభం అవుతుందని సింగపూర్ నిఫ్టి అంటోంది. నిఫ్టికి ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. కాబట్టి లెవల్స్‌న్‌ బట్టి ట్రేడ్‌ చేయండి. నిఫ్టి క్రితం ముగింపు 18,212. ఇవాళ నిఫ్టికి 18320 కీలకం. ఈ స్థాయిని దాటితే నిఫ్టిలో ట్రేడ్‌ చేయొద్దు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో సెల్‌ చేయొచ్చు. 18350 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయండి. డాలర్‌ క్షీణిస్తున్నందున…ఐటీ షేర్లలో ర్యాలీ కొనసాగడం కష్టం. నిఫ్టి గనుక 18300 లేదా 18280 స్థాయి దిగువకు వస్తే అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిఫ్టి ఇవాళ క్రితం ముంగిపును తాకుతుందేమో చూడండి. 18150 ప్రాంతం వరకు కొనుగోలు చేయొద్దు. గ్యాపప్‌ ఓపెనింగ్‌తో మీకు షార్ట్‌ చేసే అవకాశం తప్ప… కొనే ఛాన్స్‌ రాదు. వెంటనే నిఫ్టిలో అమ్మకుండా… ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చూసి..పొజిషన్‌ చూడండి. ముఖ్యంగా టీసీఎస్‌ కౌంటర్‌. విప్రో డల్‌గా ప్రారంభం కావొచ్చు.