For Money

Business News

డామిట్‌… నష్టాల్లో నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి షాక్‌ ఇచ్చిన మన నిఫ్టి. దాదాపు 150 పాయింట్ల లాభంతో ఉన్న నిఫ్టి తరవాత 100 పాయింట్ల లాభానికి చేరింది. కాని మన మార్కెట్‌ మాత్రం స్వల్ప లాభాలతో ప్రారంభమై… వెంటనే క్షీణించింది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌కు మార్కెట్‌ షాక్‌ ఇచ్చింది. రాత్రి అమెరికాలో పెరిగిన ఇన్ఫోసిస్‌ మన మార్కెట్‌లో చతికిల పడింది. కేవలం ఒకశాతం లాభానికే పరిమితమైంది. మార్జిన్స్‌ విషయం టీసీఎస్‌ నిరాశర్చడంతో ఆ షేర్‌ కూడా నామ మాత్రపు లాభాలకు పరిమితమైంది. సాధారణ ఫలితాలు ప్రకటించిన విప్రో షేర్‌ 4.5 శాతం క్షీణించింది. ఉదయం అన్ని బిజినెస్‌ న్యూస్‌ ఛానల్స్‌లో విశ్లేషకులు… ఇన్వెస్టర్లకు లాభాలు స్వీకరించమని సలహా ఇచ్చారు. కనీసం 50 శాతం లాభాలు స్వీకరించమని షార్ట్‌ టర్మ్ ట్రేడర్స్‌కు సూచించారు. ఉదయం 18,258ని తాకిన నిఫ్టివెంటనే 18203 పాయింట్లకు అంటే ఆరు పాయింట్ల నష్టానికి పడింది. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో ట్రేడింగ్‌ పూర్తిగా విదేశీ ఇన్వెస్టర్లు నిర్దేశిస్తున్నారు. నిఫ్టి మళ్ళీ పెరిగితే 18278 వద్ద నిరోధం ఎదురు కావొచ్చు. పడితే వెంటనే 18,165 వద్ద మద్దతు ఉంది. ఆ స్థాయి దిగువకు వస్తే 18,147 వద్ద మద్దతు ఉంది.