హోమ్ లోన్లపై వడ్డీ తగ్గదా?
ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన వెంటనే మీడియాలో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయని వార్తలు వస్తాయి. నిజానికి ఆర్బీఐ తగ్గించేది రెపో రేటు. ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటు. కాని హోంలోన్లు ఇచ్చేది MCLR (Marginal Cost of Funds-based Lending Rate-MCLR) ఆధారంగా. అంటే మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు, కస్టమర్ల నుంచి తీసుకునే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ… తదితర అంశాల ఆధారంగా బ్యాంకులు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. అందుకే ఆర్బీఐ ఒక శాతం వడ్డీ రేటు తగ్గిస్తే… బ్యాంకులు అదే స్థాయిలో వడ్డీ తగ్గించవు. కాని వెంటనే ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ముఖ్యంగా పాత రుణలపై వడ్డీ రేట్లు తగ్గడం చాలా తక్కువ. ఎందుకు MCLR అధికంగా ఉంటుంది కాబట్టి. అందుకే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్బీఐ 1.25 శాతం మేర రెపో రేటు తగ్గినా… చాలా మంది హెమ్‌లోన్లు ఆ మేరకు తగ్గలేదు. ముఖ్యంగా పర్సనల్ లోన్లు వంటివాటిపై వాయింపు అలాగే కొనసాగుతోంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన వెంటనే కొన్ని బ్యాంకులు తాము కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తాయి… కాని వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. పైగా అమల్లో రావడానికి నెలలు పడుతుంది. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ డల్‌గా ఉండటానికి అధిక వడ్డీ రేట్లే కారణం. అధికారులు, ప్రభుత్వ పెద్దలు పైకి చెబుతున్నా… వాస్తవానికి మార్కెట్‌లో రేట్లు అధికంగానే ఉన్నాయి. ఇప్పటి నాలుగు సార్లు వడ్డీ రేట్లు తగ్గించినా… Affordable housing స్కీము చతికిల పడటానికి కారణం అధిక వడ్డీ రేట్లే. ధనికులు కొనే విలాసవంతమైన ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయే కాని… మిడ్ క్లాస్ కొనే ఇళ్ళకు డిమాండ్ బాగా తగ్గింది. ఇప్పటికే నగరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న లక్షల ఇళ్ళు For Sale కిందే ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగుల జీతాలు, మార్కెట్‌లో నిధుల సమీకరణ వ్యయం, బాండ్లపై ఈల్డ్, రూపాయి పతనం… ఇవన్నీ బ్యాంకు వడ్డీని ప్రభావితం చేస్తాయి. దాంతో వాస్తవ వడ్డీకి, ఆర్బీఐ చెప్పే వడ్డీకి తేడా చాలా ఉంటోంది.
