For Money

Business News

బలహీనంగా ప్రారంభమైన నిఫ్టి

మార్కెట్‌ ఓపెనింగ్‌లోనే చాలా బలహీనంగా కన్పించింది. ఓపెనింగ్‌15,755 పాయింట్ల నుంచి 15,711 పాయింట్లకు కొన్ని నిమిషాల్లోనే పతనమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 4 పాయింట్ల లాభంతో 15,725 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ నిఫ్టికి ప్రధాన బలం ఆటో షేర్లు. కొన్ని నిమిషాలకు ముందు వెల్లడైన జూన్‌ వాహనాల అమ్మకాల డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉండటంతో దాదాపు అన్ని ప్రధాన ఆటో కంపెనీల షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఎగుమతులు బాగుండటంతో బజాజ్‌ ఆటో రెండున్నర శాతంపైగా లాభపడింది. అలాగే ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, ఎస్కార్ట్స్‌, టీవీఎస్‌ మోటార్స్‌… ఇలా అన్ని ఆటో షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఈ కౌంటర్లలో ఏ మాత్రం లాభాల స్వీకరణ వచ్చినా నిఫ్టి మళ్ళీ నష్టాల్లోకి జారే అవకాశముంది. ఎందుకంటే ఇతర సూచీలు ఏవీ నిఫ్టికి మద్దతుగా లేవు. మిడ్‌ క్యాప్‌తో సహా అన్ని ప్రధాన సూచీలు రెడ్‌లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు కూడా క్రమంగా అమ్మకాలకు పాల్పడుతున్నారు.

నిఫ్టి టాప్ గెయినర్స్‌
ఎం అండ్‌ ఎం 798.00 2.61
బజాజ్‌ ఆటో 4,237.70 2.51
టాటా మోటార్స్‌ 344.85 1.55
ఐషర్‌ మోటార్స్‌ 2,702.25 1.16
హీరో మోటోకార్ప్‌ 2,935.75 1.14

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,952.85 -1.05
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,007.30 -0.89
టెక్ మహీంద్రా 1,086.05 -0.86
ఇన్ఫోసిస్‌ 1,568.40 -0.78
విప్రో 541.45 -0.77