For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద జోష్‌ కన్పించడం లేదు. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డాలర్‌ పెరుగుతూనే ఉంది. క్రూడ్‌ కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎనర్జీ షేర్ల లాభంతో డౌజోన్స్‌ అర శాతం వరకు లాభంతో ముగిసినా.. నాస్‌డాక్‌ రెండో రోజూ నష్టాల్లో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ నామ మాత్రపు లాభాలకే పరిమితమైంది. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ ఒక శాతంపైగా నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు సెలవు. జపాన్‌ నిక్కీ అర శాతం వరకు నష్టాల్లో ఉంది. చైనా మార్కెట్లది అదే పరిస్థితి. సింగపూర్‌ నిఫ్టి స్థిరంగా ట్రేడవుతోంది.దీంతో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.