For Money

Business News

NIFTY TRADE: ఇంట్రాకైతే అమ్మడమే

ప్రపంచ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. నామ మాత్రపు నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా ఇవాళ అరశాతంపైగా నష్టంతో ఉంది. మన మార్కెట్లలో ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ ఉంది. కాబట్టి షేర్లకన్నా నిఫ్టిలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఇక టెక్నికల్స్‌ వరకైతే దాదాపు అన్ని సూచీలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. అయితే ఓవర్‌బాట్‌ నుంచి నిఫ్టి బయటపడుతోంది. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్‌ దిగువ స్థాయిలో కొనుగోలు చేయొచ్చు. కాని ఇంట్రా డే ట్రేడర్లు మాత్రం అమ్మడానికి ప్రాధాన్యం ఇవ్వండి. నిఫ్టిలో గత కొన్ని రోజుల్లో ఒకే ధోరణి కన్పిస్తోంది. ఆరంభంలో పెరిగితే … అమ్మకాల ఒత్తిడి… స్థిరంగా క్లోజ్‌ కావడం. నష్టాలతో ప్రారంభమైతే కోలుకోవడం స్థిరంగా క్లోజ్‌ కావడం. దీంతో పొజిషనల్‌ ట్రేడర్స్‌కు నిఫ్టిలో పెద్ద లాభాలు రాలేదు.
ఇక ఇవాళ్టి ఇంట్రాడే విషయానికొస్తే… నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,721. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 15760. నిఫ్టి ఈ స్థాయి దాటతే 15,780 వద్ద నిఫ్టికి గట్టి నిరోధం ఎదురు కానుంది. ఒక వేళ ఓపెనింగ్‌లోనిఫ్టి ఈ స్థాయికి వస్తే 15,800 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. ఇక నిఫ్టి క్షీణిస్తే… 15,687-15682 ప్రాంతంలో మద్దతు లభిస్తుందేమో చూడండి. కాస్సేపు ఆగండి. ఎందుకంటే ఈ స్థాయి కోల్పోతే నిఫ్టి చాలా ఈజీగా 15660-15,650 ప్రాంతానికి పడనుంది. ఈ స్థాయికి వస్తే 15,640 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. 15,630 దిగువకు వెళితే కొనుగోలు చేయొద్దు.అయితే పొజిషనల్ ట్రేడర్స్‌ కొనుగోలు చేయొచ్చు. కార్పొరేట్‌ ఫలితాలు రావడం మొదలయ్యే వరకు… నిఫ్టి డల్‌గా ఉంటుంది. కాబట్టి తక్కువ లాభంతో ట్రేడ్‌ చేయడం మంచిది.