For Money

Business News

నిఫ్టి… అమ్మకాలతో లాభాలు

సేమ్‌ ట్రెండ్‌. ఇవాళ కూడా పూర్తి ఆల్గో ట్రేడింగ్‌. టెక్నికల్స్‌ పరంగా సాగిన ట్రేడింగ్‌. ఉదయం 15755 పాయింట్ల గరిష్ఠ స్థాయి వద్ద ప్రారంభమైన నిఫ్టి తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఉదయం నుంచి నాలుగు సార్లు గ్రీన్‌లోకి వచ్చి… నష్టాల్లో ముగిసింది. ఉదయం పేర్కొన్న నిఫ్టి రేంజ్‌కే పరిమితమైంది. మిడ్‌ సెషన్‌లో తొలి 15680 ప్రాంతానికి వచ్చి నిఫ్టి ఆ తరవాత కోలుకుని15,730ని తాకింది. ఆ తరవాత నేరుగా రెండవ మద్దదు స్థాయి 15,667 స్థాయిని తాకింది. అంటే 60 పాయింట్లు క్షీణించింది. ఎట్టకేలకు క్రితం ముగింపుతో పోలిస్తే 41 పాయింట్ల నష్టంతో 15,680 వద్ద ముగిసింది. ఉదయం నిఫ్టికి అండగా నిలిచిన ఆటో షేర్లలో లాభాల స్వీకరణ రావడంత పలు షేర్ల లాభాలు బాగా తగ్గాయి. మెటల్స్‌, ఫార్మా వెలుగులోకి రావడంతో నిఫ్టి నష్టాలు తగ్గాయి. బ్యాంక్‌ నిఫ్టి, మిడ్ క్యాప్‌ నిఫ్టి కూడా నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,572.00 2.75
హిందాల్కో 379.75 2.07
బజాజ్‌ ఆటో 4,205.95 1.74
టాటా మోటార్స్‌ 344.50 1.44
సన్‌ ఫార్మా 684.00 1.27

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 11,839.00 -2.23
బ్రిటానియా 3,596.95 -1.44
ఇన్ఫోసిస్‌ 1,561.95 -1.19
విప్రో 539.60 -1.11
శ్రీసిమెంట్స్‌ 27,207.00 -1.08