For Money

Business News

మళ్ళీ వడ్డీ రేట్ల భయాలు

వచ్చే నెల ఫెడరల్‌ రిజర్వ్‌ మళ్ళీ వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశముందని ఫెడ్‌ అధికారులు అంటున్నారు. దీంతో బాండ్‌ ఈల్డ్స్‌ అనూహ్యంగా పెరిగాయి. స్వల్ప కాలిక బాండ్‌ ఈల్డ్స్‌ 4.4 శాతం పెరగడం విశేషం. డాలర్‌ కూడా 0.7 శాతం పెరిగింది. దీంతీ ఈక్విటీ మార్కెట్లలో మళ్ళీ ఒత్తిడి మొదలైంది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు ఒక శాతం మేర క్షీణించగా, డౌజోన్స్‌ కూడా 0.73 శాతం క్షీణించాయి. అంతకుముందు యూరప్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ఒక్క జర్మనీ డాక్స్‌ మాత్రమే నామ మాత్రపు లాభం అంటే 0.04 శాం లాభంతో ట్రేడవుతోంది.