For Money

Business News

గ్రీన్‌లోకి వచ్చిన మార్కెట్లు

అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలొసి తైవాన్‌ పర్యటన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్‌… తీరా మార్కెట్‌ ప్రారంభమయ్యాక.. గ్రీన్‌లోకి వచ్చాయి. ఇంకా డౌజోన్స్‌ 0.4 శాతం నష్టంతో ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.15 శాతం, నాస్‌డాక్‌ 0.48 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్‌ను అడుగు పెట్టొద్దని చైనా చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నాన్సి పెలొసి తాను చెప్పినట్లుగానే ఆ దేశంలో దిగారు. చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి ఆమె తన మద్దతు తెలపనున్నారు. చైనా వార్నింగ్ నేపథ్యంలో డాలర్‌ అరశాతంపైగా పెరిగింది. గత కొన్ని రోజులు డాలర్‌ క్షీణిస్తూ వస్తోంది. ఒపెక్‌ దేశాల భేటీ నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్ స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక శాతం లాభంతో బ్రెంట్‌ క్రూడ్‌ ట్రేడవుతోంది. వెండి ఒక శాతం దాకా క్షీణించినా.. బంగారం మాత్రం స్థిరంగా ఉంది. ఇటీవలే 1700 డాలర్ల దిగువకు వెళ్ళిన బంగారం ఇపుడు 1792 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు యూరో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిశాయి.