For Money

Business News

జొమాటొకు ఊబర్‌ గుడ్‌బై?

జొమాటొ కంపెనీలో తనకు ఉన్న వాటాను ఊబర్‌ విక్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జొమాటో ఈక్విటీలో 7.8 శాతం వాటా ఊబర్‌కు ఉంది. ఇవాళ బ్లాక్‌ డీల్‌ కింద ఊబర్‌ తన వాటా షేర్లను విక్రయించినట్లు తెలుస్తోంది. బ్లాక్‌ డీల్ ద్వారా జరిగిన ఈ సేల్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందలేదు. రేపు ట్రేడింగ్‌కు ముందు లేదా ఆరంభమైన వెంటనే ఈ డీల్‌ వివరాలు తెలిసే అవకాశముంది. ఒక్కో షేర్‌ను రూ.48-రూ.54 మధ్య ధరకు విక్రయించి ఉండొచ్చని భావిస్తున్నారు. జొమాటొ నుంచి ఊబర్‌ వైదొలగుతుందని మార్కెట్‌ గత కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లపై లాక్‌ ఇన్‌ పీరియడ్‌ అయిపోవడంతో జొమాటొ నుంచి అనేక విదేశీ సంస్థలు, పెద్ద ఇన్వెస్టర్లు వైదొలిగారు. ఇవాళ జొమాటొ షేర్‌ 20 శాతం లాభంతో ముగిసిన విషయం తెలిసిందే.