For Money

Business News

క్యాష్‌ విత్ డ్రాకు నో జీఎస్టీ

బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. బ్యాంకులు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపైనే జీఎస్టీ ఉంటుందన్నారు. వినియోగదారుల చెక్‌బుక్‌లపై పన్ను ఉండదన్నారు. (ఆటోమేటిగ్గా చెక్‌ బుక్‌ ధరను బ్యాంకులు పెంచుతాయి) రాజ్యసభలో ధరల పెరుగుదలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ ఈ వివరణ ఇచ్చారు. ముందుగా ప్యాక్‌ చేసి లేబుల్‌ వేసిన ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని.. ఆ ప్రతిపాదనకు ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ముందుగా ప్యాక్‌ చేసి.. లేబుల్‌ వేసిన వస్తువులపైనే 5 శాతం జీఎస్టీ విధిస్తున్నామని… విడిగా విక్రయిస్తే ఎలాంటి పన్నూ ఉండదని ఆమె తెలిపారు. కొత్త శ్మశానవాటికల నిర్మాణంపై మాత్రం పన్ను ఉంటుందని స్పష్టంచేశారు.