For Money

Business News

మళ్ళీ ఆయిల్‌ సెగ…నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

ఇరాన్‌తో ఒప్పందంపై గ్యారంటీ ఇవ్వలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పడంతో ఒక్కసారిగా క్రూడ్‌ ధరలు పెరిగాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 108 డాలర్లు దాటింది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 100 దిశగా పయనిస్తోంది. దీంతో ఇవాళ వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. ముఖ్యంగా నాస్‌డాక్‌ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎకనామీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స మాత్రం 0.23 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఉదయం నుంచి ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా మన మార్కెట్లు పనిచేయలేదు. ఆసియా మార్కెట్లలో చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. మెజారిటీ మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.