పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
నయారా ఎనర్జి (పాతపేరు ఎస్సార్ ఆయిల్) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున పెంచినట్లు నయరా వెల్లడించింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు 50 శాతం పెరిగిన నేపథ్యంలో తాము రీటైల్ ధరలు పెంచాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఈ కంపెనీకి 7000 పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ధర మరికాస్త ఎక్కువ పెరగవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీలో రష్యా ప్రభుత్వ ఆధీనంలోని రాస్నాఫ్ట్కు మెజారిటీ వాటాఉంది.
