For Money

Business News

ఆకర్షణీయ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

క్రూడ్‌ ధరల పతనం ఇవాళ కూడా కొనసాగడంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై నెలకొన్న భయాలు తగ్గాయి. ఆరంభం నుంచి అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన నాస్‌డాక్‌ ఇవాళ 1.8 శాతం లాభంతో ఉంది. మైక్రోసాఫ్ట్‌ 1.6 శాతం బ్రాండ్‌కామ్‌ షేర్లు 3.6 శాతం చొప్పున పెరిగాయి. అలాగే ప్రధాన బ్యాంకు షేర్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. కంపెనీ పనితీరు అంచనాలను పెంచడంతో డెల్టా ఎయిర్‌ షేర్‌ ఏకంగా 9 శాతం లాభపడింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక శాతం, డౌజోన్స్‌ 0.81 శాతం లాభంతో ఉంది. రేపు ఫెడ్‌ నిర్ణయం వెలువడనుంది. 0.25 శాతం రేటు పెంపును మార్కెట్‌ ఇదివరకే డిస్కౌంట్‌ చేసింది. కాని ఫెడ్‌ అంచనాల కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. ఎలాంటి ప్రతికూలతలు లేకుండా ఈక్విటీ మార్కెట్లు దూసుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు ఒక మోస్తరు నష్టాలతోఉన్న డాలర్‌, క్రూడ్‌ దిగువ స్థాయి నుంచి కోలుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 100 డాలర్లను దాటింది.