For Money

Business News

బ్లిన్‌కిట్‌కు 15 కోట్ల డాలర్ల రుణం

నిధుల కొరతను ఎదుర్కొంటున్న బ్లిన్‌కిట్‌ కంపెనీ (గతంలో గోఫర్స్‌‌)కి 15 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలని జొమాట్‌ నిర్ణయించింది. ఈ రుణం ఏడాది కాలనికి 12 శాతం వార్షిక వడ్డీకి ఇస్తున్నట్లు జొమాటో పేర్కొంది. ఒకే సారి లేదా దశలవారీగా ఈ రుణం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంతకుమునుపు కూడా జొమాటొ ఈ కంపెనీకి 10 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. బ్లిన్‌కిట్‌ మూలధన అవసరాలను తీర్చేందుకు ఈ రుణం ఇచ్చినట్లు జొమాటొ పేర్కొంది.