For Money

Business News

వాల్‌స్ట్రీట్‌లో కొనసాగిన ర్యాలీ

ఇవాళ కూడా అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నా… నాస్‌డాక్‌తో సహా ఇతర సూచీలు కూడా అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. మళ్ళీ చాలా రోజుల తరవాత షేర్‌ మార్కెట్‌తో పాటు కమాడిటీ, డాలర్‌, క్రూడ్‌ గ్రీన్‌లో ఉన్నాయి. మొత్తానికి కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ కూడా కాస్త గ్రీన్‌లో ఉంది. అలాగే క్రూడ్‌ కూడా అధిక స్థాయిలో నిలబడింది. డాలర్‌తో పాటు క్రూడ్‌ పెరగడం భారత్‌ మార్కెట్‌కు ఇబ్బంది కల్గించే అంశమే. కాని వాటిని పట్టించుకునే స్థితిలో స్టాక్‌ మార్కెట్లు లేవు. ఇక బులియన్‌లో బంగారం, వెండి కూడా గ్రీన్‌లో ఉన్నాయి. కాకపోతే నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఔన్స్‌ బంగారం ధర ఇవాళ కూడా 1800 డాలర్లపైన కొనసాగుతోంది.