For Money

Business News

మెర్క్‌ కోవిడ్‌ ట్యాబ్లెట్‌కు ఎఫ్‌డీఏ ఓకే

కోవిడ్‌ వైరస్‌ తగ్గేందుకు ఫైజర్‌ కంపెనీ తయారు చేసిన ‘పాక్స్‌లోవిడ్‌’ ట్యాబ్లెట్‌కు ఆమోదం తెలిపిన 24 గంటల్లోనే మెర్క్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్‌ ట్యాబ్లెట్‌కు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. నోటి ద్వారా తీసుకునేందుకు ఉద్దేశించిన ఈ ట్యాబ్లెట్‌ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. కోవిడ్‌ లక్షణాలు కన్పించిన అయిదు రోజుల్లోగా ఈ ట్యాబ్లెట్‌ను వేసుకుంటే హాస్పిటల్‌లో చేరే అవసరం 30 శాతం తగ్గుతుందని మెర్క్‌ పేర్కొంది. అధిక రిస్క్‌ ఉన్నవారిలో చనిపోయే అవకాశం కూడా 30 శాతం తగ్గుతుందని కంపెనీ వెల్లడించింది.
అయితే వైద్యులు మాత్రం ఫైజర్‌ అభివృద్ధి చేసిన మాత్రలవైపే మక్కువ చూపుతున్నారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తక్కువగా ఉండటంతో పాటు హాస్పిటల్‌లో చేరే అవకాశాలు 90 శాతం తగ్గుతాయని ఫైజర్‌ హామిని వీరు ప్రస్తావిస్తున్నారు.