For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌…డాలర్‌ జూమ్‌

కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇవాళ భారీగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 0.74 శాతం పెరి 76.30కి చేరింది. దీంతో బులియన్ కాస్త బలహీనపడింది. కాని వాల్‌స్ట్రీట్‌ మాత్రం గ్రీన్‌లో ట్రేడవుతోంది. డౌజోన్స్‌ నామమాత్రపు లాభాలకు పరిమితం కాగా, ఎస్‌ అండ్‌ పీ 500లో కూడా లాభాలు 0.25 శాతం మించలేదు. అయితే టెక్‌ షేర్ల సూచీ నాస్‌డాక్‌ మాత్రం 0.82 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్‌ భారీగా పెరిగినా… క్రూడ్‌ ఆయిల్‌ లాభాల్లోనే ఉండటం విశేషం. రేపు ఒపెక్‌ దేశాల భేటీ నేపథ్యంలో ఆయిల్‌ ఆకర్షణీయంగా ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఒక శాతంపైగా పెరిగి 78.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.