For Money

Business News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

యూరో మార్కెట్లతో పాటు వాల్‌స్ట్రీట్‌ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. క్లోజింగ్‌ దగ్గర పడటంతో యూరో మార్కెట్లు భారీగా నష్టాలతో ఉన్నాయి. ప్రధాన మార్కెట్లన్నీ ఒక శాతం నుంచి ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చిన్న మార్కెట్లు రెండు శాతంపైగా పడ్డాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 1.92 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మరోవైపు వాల్‌స్ట్రీట్‌ ఇంకా మిడ్‌ సెషన్‌ వరకు కూడా రాలేదు. ఈలోగా నాస్‌డాక్‌ 1.23 శాతం నష్టపోగా, డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 0.6 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య టెన్షన్‌ పెరగడంతో వాల్‌స్ట్రీట్‌ కూడా భారీ నష్టంతో ముగుస్తుందేమో చూడాలి.