For Money

Business News

95 డాలర్లు దాటిన క్రూడ్‌

ఉక్రెయిన్‌కు చెందిన తూర్పు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామని రష్యా ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పడంతో మార్కెట్లలో అనిశ్చితి మరింత పెరిగింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్థిరంగా ఉన్నా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 95 డాలర్లను దాటింది. ప్రస్తుతం 1.7 శాతం లాభంతో 95.12 డాలర్ల వద్ద ఉంది. అలాగే WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 92.5 డడాలర్లకు చేరింది. డాలర్‌ స్థిరంగా ఉండటంతో బులియన్‌ ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఔన్స్‌ బంగారం ధర 1900 డాలర్ల ప్రాంతంలో కదలాడుతోంది.