For Money

Business News

వాల్‌స్ట్రీట్‌కు ఎనర్జీ, టెక్‌ షేర్ల మద్దతు

రాత్రి వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌లో ముగిసింది. ఆరంభం నుంచి టెక్‌ షేర్ల అండతో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్ పీ500 సూచీలు అర శాతం లాభంతో ట్రేడయ్యాయి. ఆల్ఫాబెట్‌ లాభాలు బాగా ఉంటాయన్న అంచనాలతో ఆ షేర్‌ 1.5 శాతం పెరిగింది. (మార్కెట్‌ క్లోజయ్యాక కంపెనీ చక్కటి పనీరు కనబర్చడంతో షేర్‌ 8 శాతం పెరిగింది) అలాగే నిన్న అమెరికాలో వారాంతపు చమురు నిల్వలు క్షీణించడంతో క్రూడ్‌ ధరలు పెరిగాయి. దీంతో ఉదయం నుంచి డల్‌గా ఉన్న డౌజోన్స్‌ కూడా కోలుకుని 0.78 శాతం లాభంతో ముగిసింది. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్థిరంగా ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 90 డాలర్లకు చేరువ అవుతోంది. ఇక బంగారం ధరల్లో పెద్ద మార్పులు లేవు. స్థిరంగా ఉన్నాయి. ఔన్స్‌ బంగారం ధర 1800 డాలర్లపైన ట్రేడవుతోంది.