For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో పరుగులు తీస్తున్నాయి. అమెరికా మార్కెట్లలో కాస్త అనిశ్చితి ఉన్నా… నిన్న డల్‌గా ఉన్నా ఆసియా మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. కాని ఆసియా మార్కెట్లలో అత్యంత కీలకమైన చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు సెలవులు కొనసాగుతున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా చైనాలో వారం రోజుల పాటు స్టాక్‌మార్కెట్లు పనిచేయవు. ఇక తెరచి ఉన్నవాటిలో జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ సూచీలు 1.5 శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టి వంద పాయింట్లకు లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి కూడా లాభాలతో ప్రారంభం కానుంది.