For Money

Business News

వాల్‌స్ట్రీట్‌… సూపర్‌ జంప్‌

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో మొదలై భారీ లాభాలతో ముగిశాయి. ఫెడ్‌ నిర్ణయాలన్నీ మార్కెట్‌ ఊహించినవే కావడం… ఈ నిర్ణయాలను మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేయడంతో… ఫెడ్‌ నిర్ణయం తరవాత భారీ లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన నాస్‌డాక్‌ రాత్రి సూపర్‌ లాభాలతో ముగిసింది. నాస్‌డాక్‌ 2.15 శాతం లాభపడగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.63 శాతం లాభంతో ముగిసింది. ఇక డౌజోన్స్‌ లాభాలు ఒక శాతానికి పరిమితమయ్యాయి. ఫెడ్‌ నిర్ణయంతో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా పెరిగి 96.38 వద్ద ట్రేడవుతోంది. రాత్రి అమెరికా వారాంతపు ముడి చమురు నిల్వలు మార్కెట్‌ అంచనాలకు మించి తగ్గడంతో క్రూడ్‌ ఆయిల్ లాభాల్లో ట్రేడవుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 74.50 డాలర్లకు చేరుకుంది. బులియన్‌ మార్కెట్‌ కూడా బాగా లాభపడింది. ఉద్దీపన ప్యాకేజీకి త్వరలోనే చరమ గీతం పాడుతున్నందున బులియన్‌ ఆకర్షణీయ లాభాలతో ముంది. ముఖ్యంగా వెండి 3 శాతం లాభంతో ఉంది.