For Money

Business News

ప్రభుత్వం చేతికి వొడాఫోన్‌

ఏజీఆర్‌ బకాయిలతోపాటు స్ప్రెక్టమ్‌ వేలానికి సంబంధించిన వాయిదాలను కేంద్ర ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి సరిపడా ఈక్విటీ షేర్లను కేటాయించాలని వోడాఫోన్‌ బోర్డు నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను కేటాయిస్తుంది. కంపెనీ మూలధనంలో 35.8 శాతం వాటాను ప్రభుత్వానికి కంపెనీ ఆఫర్‌ చేయనుంది. అయితే టెలికాం విభాగం కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈనెల 1వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈక్విటీ మొత్తం విలువ రూ. 16,000 కోట్లుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వం తరఫున యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యూటీఐ)కు షేర్లు కేటాయిస్తారు. ప్రభుత్వం ఆమోదం తరవాతే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వాటాల కేటాయింపు తరవాత ప్రభుత్వానికి రూ.35.8 శాతం వాటా ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ పీఎల్‌సీకి 28.5 శాతం వాటా, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు 17.8 శాతం వాటా ఉంటుంది.