మేం వైదొలగుతున్నాం: ట్రంప్
తమ లక్ష్యం నెరవేరిందని, ఇక తాము ఇరాన్ నుంచి వైదొలుగుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నిన్న రాత్రి ఆయన ఓవర్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై ఇవాళ అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. ఇరాన్ నుంచి న్యూక్లియర్ బెడద లేకుండా చేయడమే తమ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని తాము సాధించామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇరాన్లో ఉండటంలో అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు లేదా మూడు వారాల్లో తమ దళాలు ఇరాన్ నుంచి వైదొలుగుతాయని అన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు నిర్వహించిన అమెరికా.ఇరాన్ నుంచి తమ దళాలు ఉపసంహరణ కోసం ఆ దేశంతో ఒప్పందం చేసుకోవాల్సిన అసవరం లేదని అన్నారు. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేశామని, ఇక ఆ దేశం కోలుకోవడానికి కనీసం 15-20 ఏళ్ళు పడుతుందని అన్నారు. ఇక హర్ముజ్ జల సంధి గురించి మాట్లాడుతూ… దాన్ని గురించి పట్టించుకోవాల్సిన అసవరం తమకు లేదని ట్రంప్ అన్నారు. ఆ జలసంధిపై ఆధారపడిన ఫ్రాన్స్ వంటి దేశాలే చూసుకోవాలని అన్నారు.
