For Money

Business News

అనుకున్నట్లే వడ్డీ రేట్లు పెంపు

మార్కెట్‌ ఊహించినట్లే అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను అరశాతం మేర పెంచింది. గడచిన రెండు దశాబ్దాల్లో ఒకేసారి ఈ స్థాయిలో వడ్డీ రేట్లను ఫెడ్‌ పెంచడం ఇదే మొదటిసారి. దీంతో పాటు 9 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్‌ షీట్‌ను కూడా తగ్గించడం ప్రారంభిస్తామని ఫెడ్‌ పేర్కొంది. అంటే ట్రెజరీ, మార్టగేజ్‌ బాండ్లను తగ్గిస్తారన్నమాట. కరోనా సమయంలో దీర్ఘ కాలిక వడ్డీ రేట్లు స్థిరగా ఉండేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ లక్షల కోట్ల డాలర్ల విలువైన బాండ్లన కొనుగోలు చేసింది. ఇపుడు వీటిని తగ్గించడం వల్ల మార్కెట్‌లో నిధుల కొరత ఏర్పడి.. వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశముంది. పైగా మున్ముందు కూడా వడ్డీ రేట్లను ఫెడ్‌ పెంచే అవకాశముంది. జూన్‌1వ తేదీ కల్లా 4800 కోట్ల డాలర్ల బాండ్ల గడువు పూర్తవుతుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయడం లేదు. అలా సెప్టెంబర్‌ కల్లా 9500 కోట్ల డాలర్ల బాండ్లు, ఏడాది చివరికల్లా లక్ష కోట్ల డాలర్ల బాండ్లను ఫెడ్‌ మళ్ళీ జారీ చేయడం లేదు.