For Money

Business News

US: అమెరికా జీడీపీ మళ్ళీ డౌన్‌

వరుసగా రెండో త్రైమాసికంలో కూడా అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) క్షీణించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో జీడీపీ 0.9 శాతం క్షీణించినట్లు అమెరికా ప్రకటించింది. అంతకుముందు అంటే జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో అమెరికా జీడీపీ 1.6 శాతం చొప్పున క్షీణించింది. రెండో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం చొప్పున పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు క్షీణించే పక్షంలో సాంకేతికంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళినట్లు భావిస్తారు. కంపెనీల వద్ద స్టాక్‌ తగ్గిపోవడం (డిమాండ్‌ లేకపోవడం వల్ల కంపెనీలు స్టాక్‌ ఉంచవు) ఇళ్ళ కొనుగోళ్ళు క్షీణించడం కూడా మాంద్యానికి సంకేతంగా భావిస్తారు. జీడీపీ వృద్ధి రేటు తగ్గడం ఆందోళన కల్గించే అంశమైనా… మున్ముందు భారీగా వడ్డీ రేట్లను ఫెడరల్‌ రిజర్వ్‌ పెంచకపోవచ్చు.