For Money

Business News

వందశాతం పెరిగిన నికర లాభం

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ మార్కెట్‌ అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 1187.60 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ రూ. 595 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా వేశారు. గత ఏడాది కంపెనీ ఇదే త్రైమాసికంలో రూ. 570.80 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంటే నికర లాభం 108 శాతం పెరిగిందన్నమాట. కంపెనీ ఆదాయం కూడా రూ. 4919 కోట్ల నుంచి రూ. 5215 కోట్లకు పెరిగింది. పన్నులు, తరుగుదల ముందు లాభం (Ebitda) 23.9 శాతం నుంచి 34.1 శాతానికి పెరిగింది. స్థూల లాభ మార్జిన్‌ కూడా 2.3 శాతం పెరిగి 49.9 శాతానికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ టర్నోవర్‌లో 34 శాతం అమెరికా నుంచి రాగా, 26 శాతం దేశీయ మార్కెట్‌ నుంచి సాధించినట్లు రెడ్డీస్‌ ల్యాబ్‌ పేర్కొంది.