For Money

Business News

అదానీ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ

అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానుంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అయిన అదానీ క్యాపిటల్ వచ్చ 2024లోగా క్యాపిటల్‌ మార్కెట్‌కు తెస్తామని ఆ కంపెనీ ఎండీ, సీఈఓ గౌరవ్ గుప్తా వెల్లడించారు. 10 శాతం వాటాలను ఆఫర్‌ చేయడం ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కంపెనీ రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు)కు రుణాలు అందిస్తోంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 154 శాఖలు ఉన్నట్లు గుప్తా తెలిపారు. ఈ ఏడాది రూ.3000 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.