For Money

Business News

20 గరిష్టానికి డాలర్‌

ఇంధన ధరలు పెరగడంతో యూరో మార్కెట్ల కరెన్సీలు గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించాయి. దీంతో డాలర్‌ 20 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 107ను దాటింది. ప్రపంచంలోనే ఏడు ప్రధాన కరెన్సీలతో పోల్చి డాలర్‌ ఇండెక్స్ లెక్కిస్తారు. డాలర్‌ భారీగా పెరగడంతో మళ్ళీ క్రూడ్‌ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్‌ 100 డాలర్లకు చేరింది. WTI క్రూడ్‌ ధర 96.42 డాలర్లకు క్షీణించింది. మరో ప్రభుత్వ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ కూడా ఇవాళ పెరిగాయి. పదేళ్ళ అమెరికా ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్‌ ఇపుడు 2.66 శాతం పెరిగి 2.88 శాతం వద్ద ట్రేడవుతోంది.