For Money

Business News

GAPతో రిలయన్స్‌ ఒప్పందం

ఇటీవలి కాలంలో అనేక బ్రాండ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్‌ రీటైల్‌ తాజాగా మరో ప్రధాన బ్రాండ్‌తో ఒప్పందం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ GAPతో రిలయన్స్‌ రీటైల్‌ ఒప్పందం చేసుకుంది. దీంతో గ్యాప్‌ బ్రాండ్‌ అన్ని దుస్తులను అన్ని ఛానల్స్‌లో అంటే ఆన్‌లైన్‌లో..ఆఫ్‌లైన్‌లో అధికారిక రిటైలర్‌గా రిలయన్స్‌ రీటైల్‌ అమ్మనుంది. 1969లో శాన్‌ఫ్రాన్స్‌కోలో నెలకొల్పిన గ్యాప్‌ బ్రాండ్‌ డెనిమ్‌లో అమెరికాలోనే ప్రధాన బ్రాండ్‌గా ఎదిగింది. మారుతున్న జనరేషన్స్‌ అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్స్‌ను తేవడంలో గ్యాప్‌కు మంచి పేరుంది.