For Money

Business News

UBపై సీసీఐ భారీ జరిమానా

బీర్ అమ్మకం, సరఫరాలో ముఠా కట్టినందుకు యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ (UBL)‌పై రూ. 752 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) వెల్లడించింది. ఈ వార్తతో కంపెనీ షేర్‌ ధరపై ఒత్తిడి పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్‌ రూ. 1537కు పడిపోయింది. యునైడెట్‌ బ్రూవరీస్‌తో పాటు సాబ్‌ మిల్లర్‌ ఇండియా, కార్ల్స్‌బర్గ్‌ కంపెనీపై కూడా జరిమానా విధించింది. బీర్‌ ధరల కార్టిలైజేషన్‌కు ఈ కంపెనీలు కుమ్మక్కయ్యాని.. ఆల్‌ ఇండియా బ్రూవర్స్‌ అసోసియేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఈ పని చేశాయని సీసీఐ పేర్కొంది. పెనాల్టీ మొత్తం కట్టడానికి కంపెనీ మరింత రుణం తీసుకు రావాల్సి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంటోంది. మరోవైపు సీసీఐ నిర్ణయంపై కంపెనీ ప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. దీనికి సంబంధించి తాము తమ లీగల్ అడ్వైజర్‌లతో సంప్రదిస్తున్నామని.. చట్టం ప్రకారమే ముందుకు వెళతామని యునైటెడ్ బ్రేవరీస్ వెల్లడించింది.