For Money

Business News

20 ఏళ్ళ గరిష్ఠానికి డాలర్‌

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను 0.75 శాతం మేర పెంచడంతో డాలర్‌ పరుగులు పెడుతోంది. రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 20 ఏళ్ళ గరిష్ఠానికి తాకింది. రాత్రి 0.9 శాతం పెరిగి 111.63కి పెరిగింది. మరోవైపు అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ కూడా రాత్రి భారీగా పెరిగాయి. 2 ఏళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ 2007 తరవాత 4 శాతానికి చేరాయి. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ కడా 3.567 శాతానికి చేరడం విశేషం. మరోవైపు డాలర్ బలపడటంతో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 90 డాలర్లకు దిగువకు వచ్చింది. కాని ఇవాళ ఉదయం మళ్ళీ పెరిగి 90 డాలర్లను దాటింది. దీనివల్ల భారత్‌ వంటి దిగుమతి ఆధార దేశాలకు క్రూడ్‌ భారం పెరిగినట్లే. రాత్రి డాలర్‌ పెరగడంతో ఇవాళ మన రూపాయి 80ను దాటి మరింత బలహీనపడే అవకాశముంది.