For Money

Business News

SGX Nifty 150 పాయింట్లు డౌన్‌

వడ్డీ రేట్లను పెంచడంతో పాటు మున్ముందు మరింత జోరుగా వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్‌ స్పష్టం చేయడంతో వాల్‌స్ట్రీట్‌ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్‌డాక్‌ మళ్ళీ 1.79 శాతం నష్టంతో ముగిసింది. ఐటీ, టెక్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 2021లో దాదాపు 60 శాతం పెరిగిన ఐటీ షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు 40 శాతం దాకా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.71 శాతం క్షీణించింది. డాలర్‌ దెబ్బకు క్రూడ్‌ కుదేలు కావడంతో గ్రోత్‌ షేర్లపై కూడా తీవ్ర ప్రభావం పడింది. డౌజోన్స్‌ 1.7 శాతం క్షీణించింది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా భారీ నష్టాల్లో ఉండటం గమనార్హం.ఇక ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. కోప్సి, తైవాన్‌ మార్కెట్లు కూడా ఒక శాతం పైగా నష్టపోయాయి. హాంగ్‌సెంగ్‌ కుప్పకూలింది. తాజా సమాచారం మేరకు హాంగ్‌సెంగ్‌ 2.64 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్ల డౌజోన్స్ షాంఘై కూడా 0.7 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 150 పాయింట్లకుపైగా నష్టంతో ఉంది. సో.. నిఫ్టి ఇవాళ అత్యంత కీలక మద్దతు స్థాయి 15500 స్థాయిని కాపాడుకుంటుందా అన్నది చూడాలి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా. ఆరంభంలోనే మార్కెట్‌ తీవ్ర ఒడుదుడులకు లోను కావొచ్చు.