For Money

Business News

దేశ వ్యాప్త సమ్మె ప్రారంభం

కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల సమ్మె ఇవాళ ప్రారంభమైంది. అనేక రాష్ట్రాల్లో కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ, రేపు దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి. ఈ సమ్మెలో సుమారు 20 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొంటారని ఆల్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అమరిత్‌ కౌర్‌ తెలిపారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, తపాలా, ఆదాయపు పన్ను, బ్యాంకులు, బీమా తదితర రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఇక రాష్ట్రాల స్థాయిలో కూడా రోడ్డు రవాణా, విద్యుత్తు రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె కారణంగా రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై పాక్షిక ప్రభావం పడొచ్చని ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు పేర్కొన్నాయి. అధికారంలో ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి.