For Money

Business News

షాంఘైలో లాక్‌డౌన్‌

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. రెండు దశాల్లో తొమ్మిది రోజులు పాటు ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. షాంఘైలో నిన్న అత్యధికంగా 1600 కేసులు నమోదు అయ్యాయి. 2.5 కోట్ల జనాభా ఉన్న షాంఘైలో నెల రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం పలు రకాల ఆంక్షలు విధిస్తూ వస్తోంది. కరోనా టెస్టింగ్‌ పెంచింది… అయినా కేసులు పెరగడంతో రెండు దశల్లో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. షాంఘై తూర్పు భాగంలో సోమవారం నుంచి ఏప్రిల్‌ వరకు, పశ్చిమ ప్రాంతలో ఏప్రిల్‌ 1 నుంచి 5 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు. అలాగే కంపెనీలు, ఫ్యాక్టరీలను కూడా నిలిపి వేయాలని, వర్క్‌ ఫ్రమ్‌ హోం అమలు చేయాలని ఆదేశించింది. దీంతో తమ షాంఘై ప్లాంట్‌ను నాలుగు రోజులు మూసేస్తున్నట్లు టెస్లా ప్రకటించింది.