For Money

Business News

భారీ నష్టాల్లో చైనా మార్కెట్లు

ఇపుడు చైనాను కరోనా భయపెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో… దాని ప్రభావం స్టాక్‌ మార్కెట్‌లో కన్పిస్తోంది. ఉదయం నుంచి చైనా మార్కెట్లన్నీ 1.5 శాతం నుంచి 2 శాతం వరకు క్షీణించాయి. హాంగ్‌సెంగ్‌ 0.70 శాతం నష్టంతో ట్రేడవుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు నాస్‌డాక్‌ మినహా గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి మాత్రం స్థిరంగా ట్రేడవుతోంది. ఆస్ట్రేలియా మినహా అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. మరి చైనా మార్కెట్ల పతనం మన మార్కెట్లకు కలిసి వస్తుందా లేదా ఇతర మార్కెట్ల మాదిరి మన మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటాయేమో చూడాలి.