For Money

Business News

NIFTY TODAY : 17175 కీలకం

నిఫ్టి గత శుక్రవారం నిరాశాజనకంగా ముగిసింది. అమెరికా మార్కెట్ గతవారమంతా గ్రీన్‌లో ఉన్నాయి. శుక్రవారం కూడా నాస్‌డాక్‌ స్థిరంగా ముగిసింది. మిగిలిన రెండు సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అయితే కరోనా ఇపుడు చైనాకు పెద్ద సమస్యగా మారింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో చైనా మార్కెట్లతో పాటు హాంగ్‌సెంగ్‌ కూడా నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌

అప్ బ్రేకౌట్‌ 17290
రెండో ప్రతిఘటన 17254
తొలి ప్రతిఘటన 17230
నిఫ్టి కీలక స్థాయి 17175
తొలి మద్దతు 17076
రెండో మద్దతు 17052
డౌన్‌ బ్రేకౌట్‌ 17016