For Money

Business News

నిరుత్సాహ పర్చిన టైటాన్‌

 

మార్చితో ముగిసిన త్రైమాసికంలో టైటన్‌ కంపెనీ పనితీరు మార్కెట్‌ను నిరుత్సాహపర్చింది. మార్కెట్‌ అంచనాలను ఈ కంపెనీ ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 618 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని మార్కెట్‌ ఆశించింది. ఇవాళ కంపెనీ రూ.491 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 7 శాతంపైగా క్షీణించింది. కంపెనీ ఆదాయం కూడా 2 శాతం క్షీణించి రూ. 7276 కోట్లకు చేరింది. టాప్‌లైన్‌ విషయంలో కంపెనీ మార్కెట్‌ అంచనాలను మించింది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ. 7.5 చొప్పున ఫైనల్‌ డివిడెండ్‌ ఇవ్వాలని టైటన్‌ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది అదనంగా 269 స్టోర్స్‌ను ప్రారంభించామని, దీంతో కంపెనీ మొత్తం స్టోర్స్‌ సంఖ్య 2178కి చేరిందని టైటన్‌ పేర్కొంది.