For Money

Business News

అదానీ చేతికి ‘కోహినూర్‌’ బ్రాండ్‌

గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు కనబర్చిన అదానీ విల్మర్‌… మరుసటి రోజే ప్రధాన బ్రాండ్‌లను కొనుగోలు చేసి ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. కోహినూర్‌ బ్రాండ్‌ బాస్మితి, రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ కర్రీస్‌, మీల్స్‌ పోర్టు ఫోలియోను కూడా అదానీ విల్మర్‌ కొనుగోలు చేసింది. ఏ ధరకు కొనుగోలు చేసింది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మెక్‌ కార్మిక్‌ స్విట్జర్‌ల్యాండ్‌ జీఎంబీహెచ్‌ వాటాను అదానీ కొనుగోలు చేసింది. ఈ బ్రాండ్‌లను కొనుగోలు చేయడంతో కంపెనీ ప్రీమియం బ్రాండ్‌ల సంఖ్యను పెంచకుంది.