For Money

Business News

లాభాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్‌

నిన్న రాత్రి ఆరంభంలో నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌లో ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేపు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఈనేపథ్యంలో రాత్రి పదేళ్ళ ట్రెజరీ బాండ్సపై ఈల్డ్స్‌ 3 శాతంపైగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ రాత్రి స్థిరంగాఉంది. రాత్రి టెక్‌ షేర్లకు మద్దతు లభించింది. ముఖ్యంగా ఇటీవల బాగా క్షీణించిన ఎన్‌విదా, ఫేస్‌బుక్‌, ఏఎండీ షేర్లు అయిదు శాతంపైగా లాభపడ్డాయి. టెస్లా నాలుగు శాతం దాకా పెరిగింది. అమెజాన్‌ మంత్రి ఇంకా కోలుకోలేదు. స్వల్ప లాభంతో ముగిసింది. నాస్‌డాక్‌ 1.63 శాతం పెరగ్గా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.57 శాతం పెరిగింది. డౌజోన్స్‌ మాత్రం 0.26 శాతం లాభంతో ముగిసింది. ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. రంజాన్‌ పండుగ సందర్భంగా చాలా వరకు ఆసియా మార్కెట్లకు సెలవు. చైనాలో మేడే సెలవులు వారం చివరి వరకు ఉంటాయి. అలాగే సౌదీ అరేబియాలో రంజాన్‌ సెలవు వారం చివరి వరకు ఉంటాయి. ఇతర గల్ఫ్‌ దేశాల్లో మూడు రోజుల పాటు పండుగ సెలవు ఉంటుంది.